సాక్షి డిజిటల్ న్యూస్ 31 అక్టోబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులను రద్దు చేయాలని కొంతకాలంగా వివిధ రూపాల్లో ఆదివాసీలు నిరసనలు తెలియజేస్తే వారిపై అల్లూరిజిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ క్రిమినల్ కేసులు పెడతామని భయపెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న తప్పుపట్టారు గురువారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు గిరిజన ప్రాంతాల్లో హైదరాబాద్ ప్లాంట్ ఒప్పందాలకు సంబంధించిన జీవో నెంబర్లు 2 13 51 లను రద్దు చేయాలని కొంతకాలంగా పోరాటం నిర్వహించడం జరిగిందన్నారు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి ప్రజల హక్కులను మనోభావాలను అర్థం చేసుకుని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక అందించాల్సిన కలెక్టర్ ఉద్యమాలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని గిరిజనులను హెచ్చరించడం ఆశ్చర్యంగా ఉందని మండిపడ్డారు వేలాది ఎకరాలు సాగు చేసుకుని జీవిస్తున్న ఆదివాసీలపై జులం ప్రదర్శించడం బాధాకరమన్నారు ఆదాని బినామీలు చట్ట విరుద్ధంగా గిరిజన భూమిలో సర్వేరాలు వేసిన వారిపై చర్యలు శూన్యం అన్నారు గిరిజనుల హక్కులను కాలు రాస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని వెంకన్న హెచ్చరించారు