సింగరేణి కాంటాక్ట్ కార్మికుల పిఎఫ్

* ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల పిఎఫ్ జమ వివరాలు అందజేయాలి *ఐ ఎఫ్ టి యు నాయకులు యస్ డి నా సర్ పాషా

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31 మణుగూరు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్నా : కొత్తగూడెం రీజియన్ స్థాయి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల పిఎఫ్ జమ వివరాలు అందజేయాలనీ, ఆన్లైన్ సేవలు అందుబాటులో తేవాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొత్తగూడెంలో సీఎం పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ కనకమ్మ, ఇన్స్పెక్టర్ చిరంజీవి బొగ్గు గని కార్మికుల భవిష్య నిధి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ కొత్తగూడెం రీజియన్ సీఎం పిఎఫ్ కార్యాలయ పరిధిలోని మణుగూరులో 2022 మార్చి వరకు మాత్రమే పిఎఫ్ జమ వివరాలు కాంటాక్ట్ కార్మికులకు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం మార్చి వరకు జమ వివరాలు తెలపాల్సి ఉందనీ అదేవిధంగా మణుగూరు ఏరియా యాజమాన్యం దీనికి సంబంధించి వివి రన్ కూడా కొత్తగూడెం పిఎఫ్ కార్యాలయానికి పంపించడం జరిగిందని తెలిపారు. దయచేసి వీలైనంత త్వరగా 2025 మార్చి వరకు సీఎం వివరాలు అందజేయాలని అలాగే మణుగూరు ఏరియా స్టోర్స్ విభాగం కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి గత ఐదు సంవత్సరాల నుండి జమ వివరాలు తెలియటం లేదనీ దయచేసి మణుగూరు ఏరియా అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి 2025 వరకు జమ వివరాలు అందజేయాలని, ఆన్లైన్ సేవలు అందుబాటులో సేవ్వాలని, పిఎఫ్ వాపస్ కేసులు వీలైనంత త్వరగా పరిష్కరించి దిశగా చూడాలని, కొత్తవారికి పిఎఫ్ నెంబర్లు ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *