సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంజారా సోదరులతో కలిసి సంత్ రామారావు మహారాజ్ గారి 5 వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ధర్పల్లి హెడ్ క్వార్టర్ లో రామారావు మహారాజ్ విగ్రహానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారా సోదరులందరికీ రామారావు మహారాజ్ ఆశీస్సులు జగదాంబ మాత ఆశీస్సులు వారి కుటుంబం పైఎల్లవేళలా ఉండాలని అన్నారు. బంజారాలకు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క హక్కులకు ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. భూములు ఇచ్చిన ఇండ్లు ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చిన ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని బంజారా లు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుందని బంజారాలను కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని అన్నారు మూడు మండలాలు బంజారా భవనం కావాలంటున్నారు దానికి సంబంధించిన భవనాన్ని తొందర్లోనే పూర్తి చేసుకుందామని హామీ ఇచ్చారు అదేవిధంగా ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా సోదరులు కోరిన కళ్యాణ మండపాన్ని తొందర్లోనే నిర్మించే ప్రయత్నం చేద్దామని బజారులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ధర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమెల నరసయ్య, సురేందర్ గౌడ్, మనోహర్ రెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాబు రామ్ నాయక్, మంగిత్య నాయక్, లౌడియ శ్రీనివాస్, రవి, లాల్ సింగ్, లక్ష్మణ్ నాయక్, సేవాలాల్ వివిధ గ్రామాల బంజారా సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
