సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్ జీవీఎంసీ 65 వ వార్డు పరిధి వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం శ్రావణ నక్షత్రం(స్వామివారి జన్మ నక్షత్రం) పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి మహాభిషేకం పంచామృత అభిషేకలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో స్వామివారి జన్మ నక్షత్రం(శ్రవణ) నాడు స్వామివారికీ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తర ద్వారంలో వెలసిన రెండవ ఆలయముగా గరుడాద్రి కొండపై వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వామి వారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పళ్ళ రసాలు కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకులు అడపాల నరసింహ ఆచార్యులు చే మహాభిషేకం నిర్వహించడం జరిగినది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు అన్నప్రసాదం వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు పెంటకోట నాగేశ్వరావు బాలమణి దంపతులు, దేవి టీచర్, పప్పల పుష్ప , హనుమంత్ వేణుగోపాలరావు, శ్యాం కుమార్, త్రిమూర్తులు,ఉషారాణి, సావిత్రమ్మ, లక్ష్మమ్మ,పద్మ,రమ,ఆలయ సేవకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు