సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో ఏఎల్ఎం (అసిస్టెంట్ లైన్ మాన్)గా విధులు నిర్వహిస్తున్న ఓర్సు సురేష్ (34) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు.నిన్న కురిసిన వర్షాల కారణంగా పాలడుగు గ్రామ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగి పోవడంతో సురేష్ మరికొందరు సిబ్బందితో కలిసి మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ క్రమంలో 11 కెవి లైన్‌ను ఆఫ్ చేసిన తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌ను గద్దపైకి ఎత్తి అమర్చే ప్రయత్నం చేస్తుండగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. తక్షణమే తోటి సిబ్బంది మరియు గ్రామస్తులు స్పందించి సురేష్‌ను 108 అంబులెన్స్ ద్వారా భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునే లోపు ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు.మృతుడు దత్తప్పగూడెం గ్రామానికి చెందినవాడు కాగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత మూడు సంవత్సరాలుగా ముష్పట్ల, పనకబండ గ్రామాల పరిధిలో ఏఎల్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి