విజిలెన్స్ మన అందరి సంయుక్త బాధ్యత – డిపో మేనేజర్ ఊటుకూరి సునీత

అక్టోబర్ 31, సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ జగన్, అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు విజిలెన్స్ అవగాహన వారము. విజిలెన్స్ అనేది మన అందరి సంయుక్త బాధ్యత అని సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఊటుకూరి సునీత అన్నారు. ఆర్టీసీ విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్, ఎండి ఆదేశానుసారం గురువారం సత్తుపల్లి బస్టాండ్ నందు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజిలెన్స్ అవగాహన వారము సందర్భంగా ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులందరూ కలిసి విజిలెన్స్ అనే ధర్మాన్ని నిలబెట్టదామని సందర్భంగా ఉద్యోగులకు సూచించారు. అదేవిదంగా ఈనెల 27వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ అవగాహన వారము జరుగుతుందని, ప్రతి ఒక్కరూ విజిలెన్స్ మనందరి బాధ్యతగా గుర్తెరిగి నడుచుకోవాలని అన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఉద్యోగులకు సూచించారు. ప్రతిజ్ఞ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తో పాటు అసిస్టెంట్ మేనేజర్ పి విజయ శ్రీ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితీ, సత్తుపల్లి డిపో ఆర్టీసీ హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్స్, గ్యారేజీ సిబ్బంది, ఏడీసీలు, ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *