సాక్షి డిజిటల్ న్యూస్,అక్టోబర్ 31, రామకృష్ణాపూర్, (మంచిర్యాల): నిరుపేద, అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, నవంబర్ 1వ తేదీ నుండి చౌక ధరల దుకాణాలలో రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రేషన్ సన్న బియ్యం కొరకు ఒక వేలిముద్ర, నాన్ ఓవెన్ సంచి కొరకు ఒక వేలిముద్ర ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఏ చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డు కలిగి ఉన్నారో అక్కడ మాత్రమే వేలిముద్రతో నాన్ ఓవెన్ సంచి ఇవ్వబడుతుందని, పోర్టబిలిటీ విధానం ద్వారా ఇతర షాపులలో రేషన్ బియ్యం పొందే వారికి నాన్ ఓవెన్ సంచి ఇవ్వబడదని, రేషన్ కార్డుదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.