సాక్షి డిజిటల్ న్యూస్ 31 అక్టోబర్ 2025 కోవెలకుంట్ల మండలం, రిపోర్టర్ రాంబాబు. కార్తీక పౌర్ణమి సందర్భంగా
ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి నందు నవంబర్ 5వ తేదీ నిర్వహించనున్న పంచరత్నములు అనే ఉచిత నాటక ప్రదర్శనలకు సంబంధించిన వాల్ పోస్టర్లను బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి ఆవిష్కరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా టీజీవి కళాక్షేత్రం కర్నూలు, బనగానపల్లె అరుణ భారతి సాహితి సంస్థ ఆధ్వర్యంలో యాగంటి క్షేత్రం నందు పంచరత్నములు అనే ఉచిత నాటక ప్రదర్శనల కార్యక్రమం ఏర్పాటు చేశారు. 5వ తేదీ బుధవారం రాత్రి 8 గంటల నుండి నాటక ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారులచే పడక సీను, శ్రీకృష్ణ తులాభారం, గయోపాఖ్యానం యుద్ధ సీను, భవాని సీను, సత్య హరిచంద్ర నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వీటికి సంబంధించిన వాల్ పోస్టర్లను బిసి రాజారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో యాగంటి పల్లె ఉపసర్పంచ్ బండి మౌళీశ్వర్ రెడ్డి, టిడిపి నాయకులు అమర్నాథ్ రెడ్డి, భూషన్న తదితరులు పాల్గొన్నారు