సాక్షి డిజిటల్ : అక్టోబర్ 31, రిపోర్టార్. తిరుపతి, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం పరిధి లోని మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బంగాళాఖాతంలో ఏర్పడిన, వాయుగుండమే కారణమైంది. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగి వరి పంటలు పూర్తిగా నేలపై పడిపోయీన పరిస్థితి మరియు కల్లాలలోని అరబెట్టిన ధాన్యం సైతం పూర్తిగా నానిపోయిన పరిస్థితి కావున ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.