సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31/2025, మండల రీపోటర్ కె దారబాబు మండలంలో అర్ల చీమలపాడు పంచాయతీ పరిధిలో సోంపురం బంధలు నేరేడు బంధ ఐదు పిత్రిగడ్డ నీళ్లుబంద గ్రామాల్లో 10 కుటుంబాలు పి వి టి జి కొందు ఆదివాసి రైతులు సుమారు 10 ఎకరాలు మెట్టుధాన్యం సోడ్లు,మొంథా తుపాన్ ప్రభావం వల్ల పూర్తిగా వరి పంట నష్టపోవడం జరిగింది.కొండ శిఖర గ్రామాలైన మాకు ఫారెస్ట్ పట్టాలు కలిగి ఉన్నాము. వ్యవసాయ అధికారులు ఏలాంటి సమాచారం కల్పిచలేదని రైతులు ఆవేదన వ్యకం చేస్తున్నారు.ఇప్పటికైనా రెవెన్యూ వ్యవసాయ అధికారులు మా గ్రామాన్ని సందర్శించి పరిస్థితులు ఆధారంగా మా భూములకు ఈ క్రాప్ నమోదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్పల అప్పారావు.కిలో పొట్టిదొర.సోంపురం బంధాలు మర్రి భాస్కరరావు కిలో రాజు కిలో సన్యాసిరావు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు పాల్గొన్నారు.