మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో9, 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి.

*వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. *జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

సాక్షి డిజిటల్ న్యూస్ : 31 అక్టోబర్ 2025 తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) గత నెల రోజుల కాలంలో 3.4 మీటర్ల భూగర్భ జలాలు పెరుగుదలలో కృషిచేసిన అధికారులు మరియు సిబ్బందికి అభినందనలు తెలిపి మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో 09 మరియు 10 తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాట్సాప్ ద్వారా ప్రభుత్వము అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు బుధవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్…. సబ్ కలెక్టర్లు ఆర్డిఓ తాసిల్దార్లు మునిసిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు నీటిపారుదల శాఖ హౌసింగ్ శాఖ తదితర శాఖల అధికారులు మరియు సిబ్బందితో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పి జి ఆర్ ఎస్ ద్వారా అందిన సమస్యల పరిష్కారం వాట్సాప్ గవర్నెన్స్ ప్రజల నుండి వివిధ అంశాలపై తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కు అవసరమయ్యే భూసేకరణ రీ సర్వే చిన్న తరహా నీటిపారుదల స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం కింద ఎక్కువమంది పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలపై ప్రజల్లో ఎక్కువగా అవగాహన కల్పించి వాట్సాప్ ద్వారా సేవలను వినియోగించుకునేలా చేయాలన్నారు. వాటర్ గ్రిడ్ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా శాఖకు అవసరమయ్యే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. చిన్న తరహా నీటిపారుదల శాఖపై సమీక్షిస్తూ గత నెల రోజుల కాలంలో అన్నమయ్య జిల్లాలో దాదాపు 3.4 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయని దీనికి కృషి చేసిన నీటిపారుదల శాఖ అధికారులు మరియు సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాబోయే ఎండాకాలంలో భూగర్భ జలాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. రీ సర్వే పై సమీక్షిస్తూ మొదటి ఫేస్ లో చేసిన తప్పులు రెండవ ఫేస్ లో చేయకుండా చూడాలని ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. హౌసింగ్ శాఖ పై సమీక్షిస్తూ స్టేజ్ కన్వర్షన్ లో పురోగతి సాధించాలని ఆదేశించారు. ఆవాజ్ ప్లస్ సర్వే కార్యక్రమాన్ని 5 నవంబర్ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పై సమీక్ష ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ కార్యక్రమాన్ని 100% జరిగేలా చూడాలన్నారు. చెత్త సేకరణ పై ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని సంబంధిత గ్రామ పంచాయతీలు చర్యలు చేపట్టాలన్నారు. మునిసిపల్ పరిపాలన పై సమీక్షిస్తూ మునిసిపాలిటీలలో నీటి సరఫరా జరిగే పైప్ లైన్లు డ్రైనేజీ పైప్లైన్లు కలవకుండా చూడాలని మంచినీరు కలుషితం కాకూడదని దీనికి చేపట్టాల్సిన చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. అన్న క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉండాలని, భోజనం సమయానికి ప్రజలకు అందేలా చూడాలన్నారు. మై స్కూల్ మై ఫ్రైడ్ కార్యక్రమం పై సమీక్షిస్తూ విద్యార్థినీ విద్యార్థుల జీవితంలో పదవ తరగతి ఎంతో కీలకమని ఆ దశలో సరైన మార్గాన్ని చూపించగలిగితే సమాజంలో అభివృద్ధిని చూడవచ్చని పేర్కొన్నారు వారంలో రెండు రోజులపాటు జిల్లాలోని ప్రతి పాఠశాలలో 9 మరియు 10వ తరగతి విద్యార్థులపై దృష్టి సారించి మ్యాథమెటిక్స్ సైన్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులలో విద్యార్థిని విద్యార్థుల అభ్యసనాన్ని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. తాను పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేసేటప్పుడు రెండు సంవత్సరాలు వరుసగా రాష్ట్రస్థాయి పేపర్లు జిల్లా నుంచి ఎంపికయ్యారని అత్యుత్తమ పాస్ పర్సంటేజ్ ను మన్యం జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా సాధించగలిగామని తెలిపారు.
మన జిల్లాలో తుఫాను తీవ్రత ఎక్కువగా లేనప్పటికీ అధికారులు మరియు సిబ్బంది అన్ని రకాల చర్యలు తీసుకున్నారని భవిష్యత్తులో ఇటువంటి తుఫాను వచ్చే సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్ఓపిని తయారు చేసుకుని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *