సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్, 31 మెదక్ ఇంచార్జి బశెట్టి గాండ్ల ఉమామహేశ్వర్, మెదక్ జిల్లాలోని మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్ మరియు నూతన క్వారీల మంజూరు కొరకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యాయనం సంస్థ సీయాజారీ చేసే పర్యావరణం అనుమతి తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి కి అత్యంత ఆవశ్యకమైన జిల్లా సర్వే నివేదికను పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మెదక్ జిల్లా సర్వే నివేదికను రూపిందించడం జరిగింది అన్నారు. ఇట్టి డ్రాప్ట్ జిల్లా సర్వే నివేదికను ప్రజా అభిప్రాయం కొరకు జిల్లా వెబ్ సైట్ లో పొందుపర్చడం జరిగింది. ఇట్టి డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదిక పై అభిప్రాయాలను జిల్లా మైనింగ్ కార్యాలయం  21 రోజుల లోపు పంపగలరు అని జిల్లా కలెక్టర్ తెలిపారు.