సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోంబర్ 31 భైంసా (నిర్మల్ జిల్లా ) ఈసీజన్ లో భారీ వర్షాలు కురవడం తో ముధోల్ నియోజకవర్గ రైతంగాం తీవ్ర స్థాయి లో నష్టపోయిందని రైతులను ఆదు కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం తుఫాన్ ప్రభావం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అత్యవసర సమయం లో తప్ప ప్రజలు ఇంటినుండి బయటకు రావద్దన్నారు.నది వాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఏదైనా సమస్య వస్తే అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం పంటలను కాపాడుకోవడానికి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. పత్తి, ఇతరత్రా పంటల నష్ట నివారణ అంచనాలు అధికారులు తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు.వర్షాల వల్ల ఇండ్లు పాక్షికంగా, పూర్తి స్థాయి లో కూలి పొతే రెవిన్యూ అధికారులకు సమాచారం అందించాలన్నారు.