సాక్షి డిజిటల్ న్యూస్,అక్టోబర్ 31, మల్లాపూర్ మండలం రిపోర్టర్: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను, రాఘవపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను డిఇఓ రాము గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో దామోదర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు