ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సుడా చైర్మన్ విద్యార్థినిలు ఇంటికి వెళ్లే సమయంలో ఆకతాయిలు మెయిన్ గెట్ వద్ద ఇబ్బంది పెడుతున్నారని సుడా చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు వెంటనే స్పందించి పోలీసు వారి దృష్టికి తీసుకువెళ్లి సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయించిన

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

పయనించే సూర్యుడు అక్టోబర్ 30 కరీంనగర్ న్యూస్: గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన దృష్ట్యా కరీంనగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను నేడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి లెక్చరర్లకు సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించి విద్యార్థినులకు భరోసా కల్పించారు. కళాశాలలో వసతులపై ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సాయంత్రం విద్యార్థినులు ఇంటికి వెళ్లే సమయంలో మెయిన్ గేటు వద్ద ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు సుడా చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు పోలీసులు మెయిన్ గేటు వద్ద పర్యవేక్షణ చేసి విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు డిఈవో గంగాధర్ ప్రిన్సిపాల్ నిర్మల సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ లెక్చరర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.