సాక్షి డిజిటల్ న్యూస్: అక్టోబర్ 31: నాగుపల్లి/ అశ్వరావుపేట ఇంచార్జ్ బుల్లా శివ. అశ్వరావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం,నాగుపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని, వారి చేతుల మీదుగా గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంగోత్ నాగు–భార్గవి దంపతుల కొత్త ఇంటిని ప్రారంభించి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం,,” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..