సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్31: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల ఇచ్చే గౌరవ వేతనం విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు పెండింగ్లో ఉన్నాయని నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతున్నారని వెంటనే గౌరవ వేతనం బిల్లులు ఇవ్వాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య డిమాండ్ చేశారు గురువారం రోజున మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ మండల సమావేశం ఏర్పాటు చేసి అనంతరం మండల విద్యాధికారి ఆఫీసులో సురేందర్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బాల్ నర్సయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో బడి మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల పాలు అవుతున్నారని ఇచ్చిన హక్కులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పాఠశాలలో పున:ప్రారంభం అయ్యి ఐదు నెలలు గడుస్తున్నా చేసిన వాటికే బిల్లులు రాలేదన్నారు బిల్లులు రాకపోయినా పిల్లలకు వంట వండి పెట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు బిల్లులు విడుదల చేయకుండా ఉండడం ఎలా అని ప్రశ్నించారు ఈ విషయంలో గౌరవ కలెక్టర్ యూనియన్ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయిన పరిష్కారం కాలేదన్నారు పర్యవేక్షణ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పెరిగిన వేతనం అన్ని మండలాలలో ఇవ్వడం లేదన్నారు నెల నెల సక్రంగా ఇవ్వడం లేదని ఒకపక్క కూరగాయల ధరలు ఆకాశం అంటుతున్నాయని అడిగిన ధరలకు ఇచ్చే మెనూ చార్జీలు పెంచడం లేదని కార్మికుల జీవితాలు పెరగకపోగా ఉన్న జీతాలు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని అన్నారు వారానికి మూడు గుడ్లు పెట్టాలని రాగిజావ పోయాలని వడ్డి చేస్తున్నారని గుడ్డుకు కేటాయించిన బడ్జెట్ రెండు గుడ్లుకు కూడా సరిపోవడం లేదని ఎలా పెట్టాలని గుడ్డుకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని లేదా అంగన్వాడి సెంటర్స్ కి సప్లై చేసినట్లుగా మధ్యాహ్నం భోజన పథకానికి కూడా గుడ్లు పప్పులు, ఉప్పులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు రాగి జావా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని కార్మికులకు అదన పనికి అదనపు వేతనం ఇవ్వాలని కోరారు ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం వెంటనే అమలు చేయాలని ఇచ్చిన హామీలు అమలు జరపాలని కోరారు గ్యాస్ సిలిండర్ 500 కే ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వడం లేదని ప్రభుత్వమే కార్మికులకు గుర్తింపు కార్డు ఈఎస్ఐపీఎఫ్ ప్రమాద బీమా కాటన్ యూనిఫామ్ ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు కోడూరి యాదగిరి దయ్యాల రేణుక భాగ్యలక్ష్మి భూలక్ష్మి రేణుక గజ్వేల్ లక్ష్మి యశోద రేవతి రమ లక్ష్మి అనూష పద్మ ఎండి గోరేబి తదితరులు పాల్గొన్నారు.