పలు వివాహ శుభకార్యాలకు ముమ్మరంగా హాజరవుతున్న యంగ్ డైనమిక్ లీడర్ అభిమన్యు రెడ్డి

★వివిధ పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన - జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడు అభిమన్యు రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రామని గణేష్ ఇదిగానిపల్లి 31-10-2025, జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండల కేంద్రంలోని గౌతపూర్ గ్రామానికి చెందిన కమ్మదనం గోపాల్ రెడ్డి యొక్క కుమారుడు ప్రకాష్ రెడ్డి వివాహం మహబూబ్ నగర్ అప్పన్నపల్లి బృందవన్ గార్డెన్స్ లో పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అదేవిధంగా అనంతరం జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ గ్రామానికి చెందిన జనగారి శ్రీనివాసులు కుమారుడు సత్యనారాయణ పెళ్లి జడ్చర్ల బూరెడ్డిపల్లి గెట్ చెన్నారెడ్డి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ వివాహా వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమన్యు యువసేన నాయకులు అభిమానులు ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.