సాక్షి డిజిటల్ న్యూస్,అక్టోబర్31, జి.మాడుగుల: గత మూడు రోజులుగా ఆంధ్రా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన తుపాన్లో జి మాడుగుల పంచాయతీ పరిధిలో పలు గ్రామాల్లో సర్పంచ్ కిముడు రాంబాబు, వీఆర్వో, కార్యదర్శి, వార్డు సభ్యులు పర్యటించారు, పంచాయతీ పరిధిలో గల రోలంగిపుట్టు గ్రామంలో సీదరి మత్యలింగం, జి ఎం కొత్తూరు గ్రామంలో సీదరి అప్పలమ్మ, కే జీ మాడుగుల లో మత్స్యరాస రత్నాలమ్మ ఇల్లు కూలిపోవడంతో సర్పంచ్ కిముడు రాంబాబు, పంచాయతీ కార్యదర్శి, స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలని, పంచాయితీలో పంట నష్టపోయిన వారి సమాచారం పంచాయతీ, సచివాలయ సిబ్బంది సేకరించి అధికారులకు తెలియజేసి నష్ట పరిహారం అందించటానికి సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వీఅర్వొ, పంచాయతీ కార్యదర్శి,నెంబర్ కూడా వరప్రసాద్
సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.