సాక్షి డిజిటల్ న్యూస్ / అక్టోబర్ 31/ తల్లాడ తల్లాడ మండలం తెలగవరం గ్రామం లో ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన నున్నా పుల్లయ్య దశదిన కార్యక్రమం వారి స్వగ్రామం తెలగవారం గ్రామం నందు గురువారం నాడు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాపా రామారావు, వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ హాజరై నున్న పుల్లయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. నివాళులర్పించిన వారిలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మోత్కూరు శ్రీనివాసరావు, కాళోజి తదితరులు పాల్గొనడం జరిగింది