నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష

సాక్షి డిజిటల్ న్యూస్ : తిరుమలగిరి. మండలం తిరుమలగిరి మండలం, బండ్లపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి నరసింహస్వామి, లింగంపల్లి వెంకటేశ్వర్లు, లింగంపల్లి లక్ష్మి, లింగంపల్లి సుజాత లకు 2017 సంవత్సరంలో వ్యవసాయ బావి వద్ద గెట్టు విషయంపై జరిగిన గొడవలో అప్పటి తిరుమలగిరి స్టేషన్ ఆఫీసర్ వి రవీందర్ రెడ్డి కేసు నమోదు చేయగా కోర్టు లో అప్పటి ఎస్సై కే. మహేష్ ఛార్జ్ షీట్ ధాకలు చేసినాడు. అట్టి కేసులో తేది. 30.10.2025 రోజున తుంగతుర్తి కోర్ట్ జడ్జి ఎండీ గౌస్ పాషా ఒక్కొక్కరికి ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష, అయిదువందల రూపాయలు జరిమానా విధించినారు. ఇట్టి కేసులో ప్రాసిక్యూషన్ తరపున పీపీ లక్ష్మణ్ నాయక్ వాదనలు వినిపించారు. తిరుమలగిరి కోర్ట్ కానిస్టేబుల్ జంగం సైదులు, తిరుమలగిరి ఎస్సై సి హెచ్. వెంకటేశ్వర్లు ప్రాసిక్యూషన్ కి సహకరించినారు.