సాక్షి డిజిటల్ న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 31 రిపోర్టర్ షేక్ సమీర్, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం తెలంగాణ : కాంగ్రెస్ సీనియన్ నేత అజారుద్దీన్‌కు రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్ భవన్ లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న హోంశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలోనే సీఎం రేవంత్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.