రిపోర్టర్: డి.మహేందర్, సాక్షి డిజిటల్ న్యూస్, (అక్టోబర్ 31 2025) జమ్మికుంట, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాలలో కళ్ళలలో పోసిన వడ్లు తడిసి రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. మెుంతా తుఫాన్ కారణంగా అధికారి వర్షాలతో చేతికి వచ్చిన పంటని అమ్ముకునే సమయంలో ఇలా జరగడం వలన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ వర్షాలకి పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అని రైతులు కంగారుపడుతున్నారు, వరి కోసే సమయంలో అకాల వర్షాలకి వరి మొత్తం నెలకొరిగింది, అధిక గాలి దుమారం వలన వడ్లు రాలడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులందరికీ ఎకరానికి 50,000 వరకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.