సాక్షి డిజిటల్ న్యూస్ / అక్టోబర్ 31/తల్లాడ, తల్లాడ మండలంలో పలు ప్రాంతా ల్లో తుఫానుకు నష్టపోయిన పంటలను పరిశీలించిన సిపిఎం తల్లాడ మండల కమిటీ ఈ సందర్భంగా బాదిత రైతులు తమ బాధలను సిపిఎం నాయకులకు తెలియపరిచారు పార్టీ డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి నష్టాలను ఎదుర్కొని కోటి ఆశలతో ఈ సంవత్సరం వ్యవసాయాన్ని సాగుచేసిన రైతాంగానికి ఈ సంవత్సరం అధిక వర్షాలు కారణంగా చీడపేడలు ఎక్కువయ్యాయని అనేక వ్యయ ప్రయాసలకు తట్టుకొని పండించిన పంట చివరి దశలో వచ్చిన మెంతా తుఫానుకుతుడిచిపెట్టుకుపోయింది అని అన్నారు పత్తి ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది క్వింటాకు 4,500 నుండి 5000 వరకు కొనుగోలు జరుగుతుందని పత్తి తీయటానికి అయ్యే కూలి ఖర్చు ఫోను క్వింటాకు 3000 రూపాయల లోపు అంటే ఎకరానికి 10 నుంచి 12000 మాత్రమే వస్తుందని పండించడానికి అయ్యే ఖర్చు 60 వేల వరకు వస్తుంది అని కౌలు రైతులకు అదనంగా ఇంకో 25వేల రూపాయల ఖర్చు వస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ రైతుకు ఇప్పటివరకు అందలేదని ఎకరానికి 50 వేలు చొప్పున నష్టం వాటిల్లిందని వరి రైతులు చివరి దశలో గాలి వర్షానికి పంట మొత్తం కిందపడి పూర్తిగా దెబ్బతిన్నదని ఎకరానికి 40 వేల చొప్పున నష్టం జరిగిందని మిరప రైతులు మూడు సంవత్సరాల నుంచి నష్టాల్లో ఉండి అరకొరగా సాగుచేసిన తుఫాను వల్ల ఎకరానికి రెండు లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని ఇతర కంది పెసర మొక్కజొన్న కూరగాయలు దెబ్బతిన్నాయని రైతులకు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వ్యవసాయ శాఖ ద్వారా అంచనా వేసి వెంటనే నష్టపరహారం చెల్లించి ఆదుకోవాలని అన్నారు కౌలు రైతులను గుర్తించి భరోసా ఇవ్వాలని లేని పక్షంలో ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని వెంటనే వారికి భరోసా కల్పించి ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు వచ్చిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేసి వెంటనే వారి ఖాతాల్లో డబ్బు జమ చేయాలని పత్తి కొనుగోళ్లలో తేమశాతాన్ని సడలించి కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని అన్నారు రైతులు ధైర్యంగా ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని రైతులకు నాయకులు భరోసా కల్పించారు పత్తికి ఎకరానికి 50,000 వరికి ఎకరానికి 40000 మిరప రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు, నల్లమోతు మోహన్ రావు, కళ్యాణపు క్రిష్ణయ్య, సత్తెనపల్లి నరేష్,కర్లకంఠ శ్రీనివాసరావు, పులి వెంకట నరసయ్య, నాయుడు శ్రీనివాసరావు,తూము శ్రీనివాసరావు, కళ్యాణపు వీరయ్య, దారెల్లి కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.