తుఫాను ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

సాక్షి డిజిటల్ న్యూస్, రిపోర్టర్:బొక్కా నాగేశ్వరరావు, (అక్టోబర్ 31 2025 ) కంచికచర్ల మండలం : తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గురువారం కంచికచర్ల మండలం కీసర గ్రామాన్ని సందర్శించారు. తంగిరాల సౌమ్య తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. కీసర పరిసర ప్రాంతాల్లో ప్రత్తి మరియు మొక్కజొన్న పంటలు పాడైపోయినట్లు రైతులు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు వివరించారు. పంట పొలాల్లోకి వెళ్లి ప్రత్యక్షంగా నష్టాన్ని పరిశీలించిన తంగిరాల సౌమ్య, రైతులతో మాట్లాడి వారి బాధలను విన్నారు. నష్టపరిహార అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తుంది. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. రైతుల నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు), కిసర సర్పంచ్ పేరం నరసమ్మ పరిటాల రాము రైతులు,రైతు నాయకులు కూటమి నేతలు, స్థానిక ప్రజానీకం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *