టీటీడీ ఈవో అనిల్ సింగాల్ ని కలిసిన శ్రీశైలం ఆలయ చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు

సాక్షి డిజిటల్ న్యూస్:అక్టోబర్ 31,నంద్యాల జిల్లా,శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అనిల్ సింఘాల్ ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి వస్త్రము,ప్రసాదము అందజేసిన శ్రీశైలం ఆలయ చైర్మన్.అనంతరం దోర్నాల వద్ద యాత్రికుల కోసం తిరుమల తిరుపతి ద్వారా ఒక వసతి సముదాయము డార్మెటరీ నిర్మించాలని అలాగే శ్రీశైలంలో కూడా టీటీడీ వసతి సముదాయాన్ని నిర్మించాలని వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వారు వెంటనే సానుకూలంగా స్పందించి చేస్తామని చెప్పడం జరిగింది. టిటిడి తరఫున టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ని వెళ్లి పరిశీలించి ఎన్ని గదులు అవసరము చెప్పమని వారికి చెప్పడం జరిగింది.టిటిడి పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి పది రోజుల్లో శ్రీశైలం దర్శనానికి వచ్చి ఈ వసతి సముదాయాల గురించి పరిశీలించి ఈవో కి పూర్తిస్థాయిలో నివేదిక అందజేస్తానని వారు చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల్లి మండలి చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ అడిగిన వెంటనే ఈవో సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా వసతి గదుల సముదాయం నిర్మిస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఈవో తో పాటు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *