టీకాలతోనే గాలికుంటు వ్యాధి నివారణ

*పశువుల్లో గాలికుంటు వ్యాధి ప్రధానంగా వైరస్ వల్ల వస్తుందని వెటర్నరీ నిపుణులు చెప్పారు *కలుషిత తాగునీరు పాడైన మేత వాతావరణ మార్పుల వల్ల వ్యాధి సోకే అవకాశం ఉంది *ఈ వ్యాధి సోకిన పశువుల నోటి నుంచి రసం రావడం కాళ్ల గిట్టల వద్ద పుండ్లు ఏర్పడడం పాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.

సాక్షి డిజిటల్ న్యూస్ కారేపల్లి అక్టోబర్ 31, పశువులకు సమయానికి టీకాలు వేస్తే గాలికుంటు వ్యాధిని నివారించవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఇందిరా తెలిపారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఏడవ విడత గాలికుంటు వ్యాధి నివారణ ఉచిత టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం మండలంలోని బొక్కల తండా గ్రామంలో పశువులకు టీకా వేసి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాలికుంటూ వ్యాధి సోకితే పశువుల్లో ఉత్పధక శక్తి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. జిల్లాలో మొత్తం 3.71 లక్షలు ఆవులు గేదెలు ఎద్దులు దూడలు ఉన్నాయని తెలిపారు. అన్ని గ్రామాలలో విడతల వారీగా టీకాలు వేస్తామని పేర్కొన్నారు. రోజు ఉదయం పశువులకు టీకాలు వేసి భారత్ పశువుల పోర్టల్ లో వివరాలను నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.డీ రమణి, గోపాలమిత్ర రేగళ్ల మంగయ్య ఓ.ఎస్ రవి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *