జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం

*ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి *వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్

సాక్షి డిజిటల్ న్యూస్, కారేపల్లి, అక్టోబర్ 31, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నవీన్ యాదవ్ గెలుపును కాంక్షిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగాఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఓటు అభ్యర్థిస్తున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ వారితోపాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మట్ట దయానంద్, సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోత్ భీముడు నాయక్,సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరాలాల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మేదిరిటోనీ, షఫీ కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం తద్యమని ఆ వాతావరణం ఎక్కడ కనిపిస్తుందని అదేవిధంగా రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయితే కట్టుబడి ఉందో అదే విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజా ఆదరణ మద్దతు మెండుగా ఉందని ఖచ్చితంగా మేము బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఆగదని కచ్చితంగా మేము గెలుస్తామని అదేవిధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించుకుంటూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మేము కొన్ని హోటల్స్ లో మరియు ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క ఆదరణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని భరోసాని మాకు కల్పించారు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడని తెలియజేశారు… కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని బ్రోచర్లు పంచుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *