పెనగలూరు ఎగువ హరిజనవాడ, ఎగువ కొత్తపల్లి వాసుల మొర.. సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 పెనగలూరు రిపోర్టర్ మధు గత మూడు రోజులుగా కురిసిన భారీవర్షాలకు పెనగలూరు ఉన్నత పాఠశాల వెనుకాల గల పెనగలూరు ఎగురు హరిజనవాడ ఎగు కొత్తపల్లి ముస్లిమ్స్ వీధి లలో కాపురం ఉంటున్న 30 కుటుంబాలు మూడు రోజుల నుంచి జలవాసం చేస్తున్నామని ఇళ్లలో నాలుగు అడుగుల మేర నీరు నిల్వ ఉండడంతో ఇంటిలోని వస్తువులన్నీ వదిలేసి తెలిసిన వారిలలో తలదాచుకుంటున్నామరు బుధవారం సాయంత్రం పెనగలూరు తాసిల్దారు అమరేశ్వరి టిడిపి నాయకులు బిఎల్ నరసింహారెడ్డి శామీర్ భాష ఆకుల చిన్నాలకు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. మంథా తుఫాను కారణంగా ప్రజలెవరు ఇబ్బంది పడకూడదని వారిని అన్ని విధాల ఆదుకోవాలని పాలకులు పదేపదే చెబుతున్న పెనగలూరు తాసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఎగువ హరిజనవాడ ముస్లిం కాలనీ అధికారులకు కనపడలేదాయని కాలనీ వాపు వాసులు వాపోయారు గత్యంతరం లేక తమ సమస్యలు టిడిపి నాయకుడు నరసింహారెడ్డికి మొరపెట్టుకోగా ఆయన నేరుగా యూనియన్ కార్యాలయానికి వెళ్లి తాసిల్దారును వెంటబెట్టుకొని కాలనీకి వస్తే తప్ప అధికారులు ఈ కాలనీ వైపు కన్నీటి చూడలేకపోవడం చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా తాసిల్దారు అమరేశ్వరి కాలనీవాసులతో మాట్లాడుతూ ఇప్పటిదాకా ఈ కాలనీలో ఇంత ప్రధానమైన సమస్య ఉందని ఎవరో తమకు తెలపలేదని వెంటనే వాన నీటి ముంపు లో ఉన్న ఈ కాలనీవాసులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా ఏడేళ్ల నుండి ప్రతి ఏడు ఓ రెండు పదుండ్లు వర్షం కురిసినప్పుడల్లా ఈ కాలనీ దుస్థితి ఇంతేనని ఎన్నిసార్లు అధికారులకు తమ బాధలు చెప్పుకున్న పరిష్కరించే నాధుడే కరువయ్యారని ఈ సందర్భంగా వాపోయారు ఈ సందర్భంగా కాలనీవాసులను ఉద్దేశించి టిడిపి నాయకుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ కూడా చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ల సహకారంతో త్వరలోనే ఈ కాలనీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కాలనీ వాసులు అధికారులు నాయకులతో మాట్లాడుతూ గ్రామానికి పడమర వైపున వాన నీటి మళ్లింపు కాలవ ప్రవించాలని అసంపూర్తిగా ఉన్న సిపియుడబ్ల్యు స్కీమ్ తాగునీటి పైపులను పూర్తి చేయించాలని కోరారు.
