సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 రాముకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా,రాష్ట్రవ్యాప్తంగా గల అన్ని గ్రంథాలయాల అభివృద్ధికి ఆయా ప్రాంత ప్రజలు మరియు విద్యావేత్తలచే ప్రత్యేక అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ మాజీ జడ్పిటిసి టీ.మునస్వామి పేర్కొన్నారు. బుధవారం ఆయన రామకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రామకుప్పం మండల కేంద్రంలో గల గ్రంధాలయ స్థితిగతులపై ప్రత్యేక నివేదిక తెప్పించుకుని గ్రంథాలయ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ కేంద్రంలో గల గ్రంథాలయం భవనం ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతిని భవనం శిథిలావస్థకు చేరుకుంటుందని ఈ గ్రంథాలయాన్ని మరొకచోటికి తాత్కాలికంగా తరలించి పక్కా భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలియజేశారు, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా శాంతి పురం గుడిపల్లి రామకుప్పం మరియు కుప్పం గ్రామీణ మండలాలలో నూతన గ్రంథాలయ భవనాలు నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతులు పొందేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి, ఆనంద్ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి పట్రా నారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ, మాజీ వైస్ ఎంపీపీ చిన్నికృష్ణ, కుప్పం నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షుడు చలపతి, మండల ప్రధాన కార్యదర్శి నరసింహులు, ఎంపీపీ సులోచన గురప్ప, యూనిట్ ఇంచార్జ్ రామమూర్తి, సీతాపతి, రామకృష్ణప్ప,వైస్ ఎంపీపీ వెంకట్రామ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కృష్ణ నాయక్, రెస్కో వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథ్, సింగల్ విండో అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.