సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్31 జి.మాడుగుల: మెంథా తుఫాన్ నేపథ్యంలో మండలంలో పలు గ్రామాలలో గురువారం చింతపల్లి ఏడిఆర్ అప్పలస్వామి , వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు జోగారావు ,బాల హుస్సేన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కే వరప్రసాద్ పర్యటించారు. మండలం నిట్టపుట్టు , గొడ్డుభూసులు గ్రామాల్లో పంట పొలాలను వారు సందర్శించారు. వారు మాట్లాడుతూ జి.మాడుగుల మండలంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రతి పంచాయితీలలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఒక్కరూ వెళ్లి పొలాలను పరిశీలించాలని వారన్నారు అక్కడక్కడ గాలుల వలన వరిచేను అక్కడక్కడ క్రిందికి పడిపోవడం గమనించడం జరిగింది. అలా ఉన్న చేనుని కట్టలుగా కట్టుకోమని సూచించడం జరిగింది, అలాగే ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నయెడల అంతర్గత కాలువల ద్వారా బయటికి పంపాలని, అలాగే గింజలు రంగు మారితే 1 మిల్లీ లీటర్ ప్రాపికొనజోల్ నీ 1లీటరూ నీటిలో కలిపి కలిపి పిచికారి చేసుకోవాలని తెలియజేశారు. చింతపల్లి ఏడిఆర్ అప్పలస్వామి, శాస్త్రవేత్తలు జోగారావు, బాలహుస్సేన్ రెడ్డి, వ్యవసాయ అధికారి కె. వరప్రసాద్ మరియు గ్రామ వ్యవసాయ సహాయకులు గ్రామ పెద్దలు, గ్రామ రైతులు పాల్గొన్నారు…