సాక్షి డిజిటల్ న్యూస్:31 అక్టోబర్, పాల్వంచ.రిపోర్టర్:కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు,పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలలో భాగంగా,డీఎస్పీ అబ్దుల్ రెహ్మాన్ ఆధ్వర్యంలో పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో డీఎస్పీ అబ్దుల్ రెహ్మాన్ మాట్లాడుతూ,జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, “షి టీమ్స్”విధులు,వేలిముద్రల ప్రాధాన్యత,డాగ్ స్క్వాడ్,బాంబ్ స్క్వాడ్ బృందాలు పనితీరు, భవిష్యత్ లో నేరాలు జరగకుండా అవగాహన కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.