ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాలలో బంద్ విజయవంతం..

సాక్షి డిజిటల్స్ (31 oct 2025), ఫరూక్నగర్ మండలం : కృష్ణ న్యూస్ రిపోర్టర్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రం కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్, డిగ్రీ, పారామెడికల్, ఇంజనీరింగ్, మరియు లా కళాశాలలో బంద్ కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. అందులో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం లో ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలల బంద్ ను ఎస్ఎఫ్ఐ నాయకులు విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులకు సుమారుగా 8500 కోట్ల పెండింగ్స్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల కావాల్సిన ఉంది అని కానీ ప్రభుత్వం మాత్రం తమకు ఎం పట్టనట్లుగా వ్యవహరిస్తుందని అన్నారు. గత ప్రభుత్వ నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడిందని అందుకే విద్యార్థులంతా ఏకమై గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు అని అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదమే ఈ ప్రభుత్వ కూడా చేస్తున్నది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి విద్యార్థుల వైపు చూడాలని అన్నారు… లేనిపక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని అని హెచ్చరిస్తావున్నాం. విద్యార్థులు పై చదువులు చదువుకోడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విద్యాశాఖకు మంత్రిని కేటాయించి విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చేయనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని హెచ్చరిస్తా ఉన్నాం.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ టౌన్ కమిటీ కార్యదర్శి శివశంకర్ ఎస్ఎఫ్ఐ నాయకులు చరణ్, చింటూ, వంశీ చంద్ర, కార్తీక్, అమీర్ బాబా,బబ్లు, సాయి,విజయ్, హరి, నవదీప్, శివ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *