సాక్షి డిజిటల్ న్యూస్: అక్టోబర్ 31, దమ్మపేట/ అశ్వరావుపేట ఇంచార్జ్, బుల్లా శివ, అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గండుగులపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరం విజయవంతంగా కొనసాగింది.
ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ వారు ఏర్పాటు చేయగా,ఉదయం 9 గంటల నుండి పరీక్షలు నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పురుషులు మహిళలు వృద్ధులు పొగాకు మరియు మద్యం సేవించే వారు ఉచిత పరీక్షలు చేయించుకున్నారు వైద్యులు ప్రజలకు క్యాన్సర్ ఎలా వస్తుంది దాని మొదటి లక్షణాలు ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు ఈ ఉచిత శిభిరాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రజల ఆరోగ్యాలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు ఆర్ధిక సమస్యలు తొలగించడం కోసమే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన బసవతారకం హాస్పిటల్ యాజమాన్యానికి వైద్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.