సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నవీన్ కథలాపూర్ తేదీ 31అక్టోబర్ 25, కథాలాపూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఫై జరిగిన దాడికి ఇప్పటికి కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న దళితుల ఆత్మ నిరసన ర్యాలీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయం పొందాలని మండలములోని అన్ని గ్రామాల నుండి దళితులంతా తరలి రావాలని కోరారు, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నినించారు,దళితుల ఆస్థిత్వాన్ని కాపాడుకోవడం చేపట్టే ర్యాలీ కి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని దళితుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమం లో ఏం అర్ పి ఎస్ అధికార ప్రతినిధి కసవత్తుల లక్ష్మి రాజం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మారం పెళ్లి వినోద్ మాదిగ విద్యార్థి విభాగం గజ్జెల దశ కుమార్ సేనిగరపు గౌతం నవదీప్ సాయి రఘు సర్వాన్ నరేష్ రిషి తదితరులు తదితరులు పాల్గొన్నారు..