సాక్షి డిజిటల్ న్యూస్,అక్టోబర్ 31,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో మాట్లాడుతూ ఎంత సేవ చేసినా జన్మనిచ్చిన ఊరి ఋణం తీర్చుకోలేమని మునిపంపుల ఉచిత కంటి పొర చికిత్స శిభిరం నిర్వాహకులు దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి (ఎన్ఆర్ఐ) అన్నారు. మునిపంపుల గ్రామంలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి రాంరెడ్డి జ్ఞాపకార్థం భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రంలో శంకర నేత్రలయ చెన్నై డాక్టర్లతో 22వ తేదీ నుండి ప్రారంభమైన ఉచిత కంటిపొర చికిత్స శిభిరం గురువారం రోజు ముగిసింది.శిభిరం ముగింపు సందర్బంగా ఆపరేషన్ చేసుకున్న వారితో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో శిభిరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఉచిత కంటి పొర చికిత్స శిభిరంలో మొత్తం 2560 మంది ఒపీ నమోదు చేసుకోగా 2119 మందికి ఉచిత కంటి అద్దాల పంపిణి జరిగిందని 122మందికి కంటి ఆపరేషన్ జరిగిందని 211మందిని చెన్నై లో శంకర నెత్రాలాయకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కన్న ఊరు ఋణం తీర్చుకోవడం కోసమే ఈ మహాత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఊరి కోసం ఇంకా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు.చికిత్స శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలకు, నిరాటాంకంగా పని చేసిన వాలంటీర్లు, వివిధ యువజన సంఘాలు, అఖిల పక్ష పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. పది రోజుల పాటు సేవాలందించిన వాలంటీర్లు దేవిరెడ్డి వీరేందర్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటిపొరా చికిత్స శిభిరంలో గ్రామంలోని యువత భగత్ సింగ్ విజ్ఞానకేంద్రం మరియు భీమ్ ఫాలోవర్స్ వారు 50 మంది స్వచ్చందంగా పది రోజులపాటు గ్రామ గ్రామన తిరిగి ప్రచారం నిర్వహించి 20 గ్రామాల నుండి వచ్చిన వారికి పరీక్షలు చేయించి ఉచిత కంటి అద్దాలు పంపిని చేసి భోజనాలు, వసతులు ఏర్పాటు చేశారు.కో -ఆర్డినేటర్ తొలుపునూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమలో మాజీ సర్పంచ్ దేవిరెడ్డి సావిత్రమ్మ, దేవిరెడ్డి పద్మ, సమన్వయ కర్తలు బొడ్డుపల్లి వెంకటేశం, గాదె శోభారాణి,శంకర నేత్రలయ కోఆర్డినేటర్ భాను ప్రకాష్,అఖిల పక్ష నాయకులు మన్నెం పద్మారెడ్డి, తాళ్లపల్లి జితేందర్, కట్ట యాదయ్య,గంటెపాక శివ కుమార్,ఉయ్యాల నర్సింహా,ఉడుతల శ్రీనివాస్,తొలుపునూరి శ్రీనివాస్, గాదె కృష్ణ,బూడిద బిక్షం,చింత గిరి బాబు, తుర్కపల్లి నరేష్, యాదాసు అరుణ్,అజయ్,బత్తిని సందీప్,అబ్రహం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
