సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 31 పెనగలూరు రిపోర్టర్ మధు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పెనగలూరు మండల కేంద్రంలో గోవులను సంరక్షించుకునే యజమానులు వాటిని రోడ్లపై తోలడం నేరమని శనగలూరు ఎస్సై డి రవి ప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. గోవులను పోషించుకునే యజమానులు వాటిని ఇళ్ల వద్దనే ఉంచుకొని పోషించుకోవడమో లేక పొలాలకు తోలుకెళ్ళి వర్షించుకోవడం చేసుకోవాలన్నారు గోవులను రోడ్లపైన తోలడం వలన నిత్యం ఎన్నో ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. కనికలూరు బస్టాండులో సాయంత్రం నుంచి తెల్లవారు వరకు నడిరోడ్డు పైన పడుకుని ఉంటాయని అన్నారు వాటి వల్ల వాహనదారులు ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు అలాగే ద్విచక్ర వాహనదారులు సైతం ఆవుల వల్ల ప్రమాదాలకు గురవుతూ ఎవరికీ చెప్పుకోలేక నిరుత్సాహంగా వెళ్ళిపోతున్నారని అన్నారు. శనివారం నుండి పెనగలూరు బస్టాండు ప్రాంతంలో ఆవులు సంచరిస్తే వాటిని తిరుపతి గోశాలకు తరలించడం జరుగుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా వినియోగదారులు ఉపయోగించి పారవేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవులు ఆరగించి జబ్బులకు గురవుతున్నాయని వాటి కారణంగా అవి మలం విసర్జన చేసినప్పుడు భయంకరమైన దుర్వాసన వెదజల్లుతోందన్నారు పాదసారులు చూసి చూడక ఆ పేడ పైన అడుగు పెట్టి మరల తమ వాహనాలు ఎక్కినప్పుడు వాహనాలన్నీ దుర్వాసనతో కంపబడుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.