సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 31 మణుగూరు/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా. మణుగూరు మండలం గ్రామపంచాయతీ సమితి సింగారం ప్రాంతానికి చెందిన మేకల సుధారాణి 55 సంవత్సరాలు అనారోగ్యంతో మరణించారు ఇది తెలిసి. మేము సైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ స్పందించి ట్రస్ట్ ద్వారా మేకల సుధారాణి కుటుంబ సభ్యులకు 3000/- రూపాయలు దహన సంస్కరాల కోసం అంద చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి రంగా శ్రీనివాసరావు. ట్రస్ట్ సభ్యులు, పి.జగన్ మోహన్, చిందుకూరి రామారావు, అమ్ములు శ్రీనివాస్, గ్రామ పెద్దలు గాజుల నరేష్ తదితరులు పాల్గొన్నారు