సాక్షి డిజిటల్ న్యూస్, 31 అక్టోబర్ 2025, బూర్గంపాడు మండలం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ రాయల నవీన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పరిధిలో గల గ్రామాల ప్రజలు అకాల వర్షాలు కురుస్తున్నందున మారుమూల మండలాల ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలు ముఖ్యంగా గిరిజన గర్భిణీ స్త్రీల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్య సేవలు అందించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట డాక్టర్లకు సూచించారు. గురువారం నాడు బూర్గంపాడు మండలంలోని సి హెచ్ సి ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్యం తీరును మరియు సి హెచ్ సి లో నిర్వహిస్తున్న రికార్డులు, సి హెచ్ సి లోని వార్డులు మరియు రోగులకు అందుచున్న సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ సిహెచ్ సి పరిధిలోని గిరిజన గ్రామాలలో డెంగ్యూ మరియు మలేరియా, టైఫాయిడ్ ఇతర వైరల్ ఫీవర్స్ విజృంభించే అవకాశం ఉన్నందన సి హెచ్ సి లలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు వైద్య సిబ్బంది సమయపాలన పాటించి విధులు సక్రమంగా నిర్వహించాలని, సి హెచ్ సి లలో గర్భిణీ స్త్రీల నమోదు పెంచాలని, డెలివరీ కోసం వచ్చే గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చూడాలని, సిహెచ్ సి కి వచ్చే రోగుల పట్ల మర్యాద పాటించి వారికి సరైన వైద్య చికిత్సలు అందించి తగినన్ని మందులు అందించాలని అన్నారు. సి హెచ్ సి పరిధిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని, ఇంటి ముందు ఇంటి వెనక నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు వహించేలా ప్రజలకు తెలియజేయాలని, డ్రైనేజీలలో మురికి నీరు నిల్వ ఉండుట వలన దోమలు ప్రబలి మలేరియా, టైఫాయిడ్, డెంగు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున సి హెచ్ సి లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకొని, మలేరియా డెంగ్యూ మరణాలు సంభవించకుండా చూడాలని అన్నారు. సి హెచ్ సి ఆవరణలో చెత్తాచెదారం ఉండకుండా చూడాలని టాయిలెట్ బాత్రూం లు ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని అన్నారు. అనంతరం తానే స్వయంగా బ్లడ్ టెస్ట్ చేయించుకుని తనకు ఎటువంటి వ్యాధి సోకిందో దానికి సంబంధించిన రిపోర్టులు తనకు పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సి పర్యవేక్షకుడు ముక్కంటి ఈశ్వరరావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిత, డాక్టర్ అమరేందర్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.