అకాల వర్షంతో తడిచిన ధాన్యం మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి డిమాండ్ చేశారు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నవీన్.కథలాపూర్.తేదీ 31. అక్టోబర్ 25 కథలాపూర్ మండల కేంద్రంలో మక్కల కొనుగోలు కేంద్రంను సందర్శించిన బిజెపి నాయకులు రైతులను కలిసి తడిసిన మక్కలను పరిశీలించారు బాధిత రైతులను కలిసి వారితో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పది రోజుల క్రితం మక్కల కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు నిన్నటి రోజున కురిసిన అకాల వర్షం కారణంగా వరి మక్కల కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం కాకుండా చూడాలని అదేవిధంగా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి మాచర్ను పట్టించు కోకుండా రైతులందరికీ న్యాయం చేసే విధంగా తొందరగా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి తప్పకుండా రైతులందరికీ న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇస్త అని ఇవ్వలేదు మరియు రైతులకు పాలిథిన్ కవర్లు అందించాలని రైతులను విస్మరించకూడదని రైతుల పక్షాన ఈ కోరిక కోరుతున్నాం అదేవిధంగా ఈ లారీల సమస్యను కూడా ఎవరైతే టెండర్ చేశారో వాళ్లు పంపితే గాని లారీలు వచ్చే పరిస్థితి లేదు దానివల్ల కూడా రైతులకు ఆలస్యం అవుతుంది కనుక రైతులందరికీ న్యాయం చేసే విధంగా ఈ మాచర్ను కండిసన్ లేకుండా తొందరగా కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వర్రావు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి,కథలాపూర్ మహేష్, గడ్డం జీవన్ రెడ్డి, కాసోజీ ప్రతాప్, మల్యాల శ్రీకర్,అందే భూమేష్, తాలుక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *