స్నేహితుల మోసంయువ డాక్టర్ ఆత్మహత్య

సాక్షి డిజిటల్ న్యూస్, అక్టోబర్ 30 (కరీంనగర్) రిపోర్టర్: సురేష్ అతిగా స్నేహితులుని నమ్మి అప్పులు తిరిగి చెల్లించలేక ప్రాణాలు తీసుకున్న యువ డాక్టర్ వైనం కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో అనస్థీషియా పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఎంపటి శ్రీనివాస్ (42) అనే వైద్యుడు తన స్నేహితులైన వింజనురి కరుణాకర్ కిరణ్, కవిత, వెంకట నరహరి అనే ముగ్గురు స్నేహితులు కోటి ముప్పై లక్షలు, బంజేరుపల్లికి చెందిన కుమారస్వామి తన వ్యాపారం కోసం 28 లక్షలు బాధితుని పేరుమీద బ్యాంక్ నుండి అప్పుగా తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా స్నేహితులు డబ్బులు తిరిగి చెల్లించకపోగా ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరించారు. శ్రీనివాస్ కి ఈఎంఐలు చెల్లించాలని, రుణం తీర్చాలని బ్యాంకు అధికారుల నుండి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ అనస్థీషియా ఇంజక్షన్ ను మొతాదుకు మించి తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు