సాక్షి డివిజన్ న్యూస్, అక్టోబర్ 29 మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: రిటైర్డ్ అయిన సింగరేణి కార్మికుల తరపున గ్రాట్యుటీకి సంబంధించిన అప్పీలు కేసులో న్యాయవాది భరత్ కుమార్ తన వాదనలను వినిపించి విజయం సాధించారు. పైన పేర్కొన్న కాల వ్యవధిలో సింగరేణి అధికారులకు సింగరేణి సంస్థ 20 లక్షల రూపాయల గ్రాట్యుటీ చెల్లించగా, కార్మికులకు మాత్రం 10 లక్షల రూపాయల సీలింగ్ గ్రాట్యుటీ మాత్రమే సింగరేణి సంస్థ చెల్లించడం జరిగింది. ఇట్టి విషయాన్నీ సవాలు చేస్తూ గత సంవత్సరం జులై నెలలో అసిస్టెంట్ లేబర్ కమీషనర్ (సెంట్రల్, హైద్రాబాద్), ఏ ఏ యల్ సి(సి) దృష్టికి తీసుకుకెళ్ళడం జరిగింది. చట్ట ప్రకారం సింగరేణి అధికారులు మరియు మన న్యాయవాది వాదనలు విన్న కమీషనరు, సింగరేణి విశ్రాంత కార్మికులకు 20 లక్షల రూపాయల సీలింగ్ లిమిట్ గ్రాట్యుటీ చెల్లించ వల్సిందిగా ఈ సంవత్సరం జనవరిలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.అయితే ఏ యల్ సి హైద్రాబాద్ తన ఆదేశాలలో గ్రాట్యుటీ చట్ట ప్రకారం (గ్రాట్యుటీ యాక్ట్ 1972) చెల్లించవల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి సింగరేణి సంస్థలో అనాదిగా వస్తున్న సర్క్యులర్ల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని ఉన్నప్పటికీ, ఎటువంటి ఆదేశాలు జారీ చేయకపోవడం గమనార్హం. ఇట్టి విషయాన్ని న్యాయవాది భరత్ కుమార్ అప్పిలేట్ అధికారి (డి వై. సి యల్ సి) హైదరాబాద్ ముందు కార్మికుల తరపున ఈ సవత్సరం మార్చ్ నెలలో అప్పీలు చేయడం జరిగింది. వాదనలు విన్న అప్పీలేట్ అధికారి (డి వై.సి యల్ సి), హైదరాబాద్ గ్రాట్యుటీ పెంపుదలపై సింగరేణిలో నేటికీ అమలులో ఉన్న సర్క్యులర్స్ ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించవల్సిందిగా నిర్ణయించారు. అప్పీలేట్ అధికారి (Dy .CLC)హైద్రబాద్ 1.1.2017 నుండి 28.03.2018. మధ్య కాలంలో రిటైర్ అయిన కార్మికులకు సింగరేణి సంస్థలో నేటికీ అమలులో ఉన్న సర్క్యులర్స్ ఆధారంగా పెంపుదలతో కూడిన గ్రాట్యుటీని చెల్లించవల్సిందిగా ఆగస్ట్ నెలలో తమ ఆర్డరులో ఉత్తర్వులు జారీ చేసారు. గ్రాట్యుటీ చెల్లింపు అనేది ఉద్యోగి/కార్మికుని యొక్క హాక్కు అని, ఆ గ్రాట్యుటీ చెల్లింపు ఉద్యోగి రిటైర్ అయిన వెంటనే చెల్లించ వలెనని, ఈ కేసులో సింగరేణి సంస్థ నేటికీ కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించ నందుకు, ఉద్యోగికి రావాల్సిన గ్రాట్యుటీ పెంపుదలమీద 10శాతం రిటైర్ అయిన మరుసటి రోజు నుండి లెక్కించి కార్మీకునికి చెల్లించ వలసిందిగా తన ఆర్డరులో అప్పిలేట్ అధికారి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈఆర్డరులో ఇచ్చిన ఆదేశానుసారంగా ఏ యల్ సి ఇచ్చిన ఆర్డరు పై విశ్రాంత కార్మికులకు 20%-30% అధిక గ్రాట్యుటీ పెంపుదల వర్తింపచేస్తుందని న్యాయవాది భరత్ కుమార్ తెలియచేసారు. అప్పిలేట్ అధికారి ఆదేశానుసారం “అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సెంట్రల్ హైద్రాబాద్” తేది 15 అక్టోబర్ 2025రోజున గ్రాట్యుటీ రూల్స్ (1972), రూల్ (18)ప్రకార. ఫామ్ (యస్) జారీ చేయడం జరిగింది. ఇట్టి ఫామ్ (యస్) లో విశ్రాంత సింగరేణి కార్మికులకు గ్రాట్యుటీ పెంపుదల అప్పిలేట్ అధికారి ఆదేశానుసారంగా, మంజూరు చేయవలసిందిగా సింగరేణి అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఇట్టి విజయానికి తన సీనియర్ హైకోర్టు న్యాయవాది యస్. సురేందర్ రెడ్డి సహకారం మరియు యూనియన్ లీడరు మరియు విశ్రాంత కార్మికుడైన మoడవ పిచ్చేశ్వర రావు మరియు తన తోటి కార్మికులైన సుదర్శన్, సారంగపాణి కృషి ఎంతో ఉందని, వీరితో పాటుగా ప్రతి విశ్రాంత సింగరేణి కార్మికుల ప్రోత్సాహం ఉందని తెలుపుతూ న్యాయవాది భరత్ కుమార్ సవినయంగా తెలియ చేసారు. ఇట్టి విజయంతో సింగరేణి కార్మికుల కుటుంబాలలో ఆనందోత్సహాలు వెల్లివిరిసాయి.