శంకర పట్టణంలో భారీ వర్షం

సాక్షి, డిజిటల్ న్యూస్, అక్టోబర్ 30, శంకరపట్నం, కరీంనగర్ జిల్లా, సీనియర్ జర్నలిస్ట్ బూర్ల రాజు,
శంకర పట్టణంలో బుధవారం భారీ వర్షం కురిసింది, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది, కల్లాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయింది, దీంతో రైతులు ఆందోళన చెందారు, చేతికి వచ్చిన వరి చేను నేలమట్టమయింది, మండలంలోని తాడికల్ వంకాయ గూడెం కేశవపట్నం అంబాలాపూర్ ఎర్ర పల్లి కన్నాపూర్ ముత్తారం మొలంగూర్ గుడాటిపల్లి కొత్తగట్టు తదితర గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో భారీ వర్షం పడింది, దీంతో భారీగా పంట నష్టం జరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు, భారీ వర్షం పడడంతో వాకులు వంకలు చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్నాయి, లక్షలాది రూపాయల విలువచేసే వరి పంటలు నేలమట్టమైనాయి, వరి ధాన్యం తడిసి ముద్ద కావడంతో రైతులు జీర్ణించుకోవడం లేదు, ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి రైతులకు పంట నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు