విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

★ఏబీవీపీ కార్యకర్తలు అర్థ నగ్నంగా నిరసన

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 29 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఎన్హెచ్ 44 జాతీయ రహదారిపై అర్ధ నగ్నంగా నిరసన తెలుపుతూ రాస్తారోకో చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయం ఏబీవీపీ కార్యకర్తలు. ప్రభుత్వం ఫీజు రిమెంబర్స్మే మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్.. రాస్తారోకో చేసిన విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన డిసిపల్లి పోలీసులు రాష్ట్రంలో ఉన్న జూనియర్, డిగ్రీ మరియు వివిధ కోర్సులకు సంబంధించిన వివిధ కాలేజీలకు బకాయిలుగా ఉన్నటువంటి వారి వారి ఫీజు రీయంబర్స్ మెంట్ తక్షణమే విడుదల చేసి, పేద విద్యార్థుల చదువు నిరంతరం కొనసాగించేలా కాలేజీ యాజమాన్యాలు ఫీజు విషయంలో విద్యార్థులను ఎలాంటి ఆంక్షలకు గురి చేయకుండా చొరవ తీసుకొని తక్షణమే పెండింగ్ లో ఉన్న రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని నిజామాబాద్ జిల్ల ఏబీవీపీ విద్యార్థి సంగంతరపున డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యక్షుడు పృథ్వీ గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరి కారణంగా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రెండు సార్లు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని బంద్ కు పిలుపును ఇవ్వడం సిగ్గుచేటు. మరొక సారి బంద్ కి సిద్ధమవుతున్నారు అంటేనే ఈ ప్రభుత్వానికి విద్యావ్యవస్థ పై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని, ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతూ మన రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేవంటూ దసరాకు 600 దీపావళికి 600 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కనీసం ఆ హామీని కూడా పట్టించుకోకుండా వాళ్లు ఇస్తాం అన్న 600 కోట్లు కూడా ఇవ్వకుండా విద్యార్థులను విస్మరిస్తున్నారు