రోడ్డుకు అడ్డంగా వున్నా గుంటవల్ల తీవ్ర ఇబ్బందులు

సాక్షి డిజిటల్ న్యూస్ : అక్టోబర్ 30: కొండపాక: రిపోర్టర్ తిరుపతి: సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని దుద్దెడా గ్రామం శివారులో గల రాంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పైన గతంలో తీసిన పైప్ లైన్ కాలువ కృంగి కాలువ లాగా ఏర్పడింది. దీనివల్ల రోడ్డుపై ప్రయాణించే వ్యక్తులకు తీవ్ర ఇబ్బందు లు ఏర్పడుతున్నాయి. మరియు పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున వెంటనే గ్రామ అధికారులు చర్యలు తీసుకొని ఆ గుంటను తొలగించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడవలసిందిగా వాహనదారులు వేడుకుంటున్నారు. మరియు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపో కలు ఈ రోడ్డుపై సాగించడం జరుగుతుంది. కావున వెంటనే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా వాహనదారులు విజ్ఞప్తి చేయడం జరిగింది.