రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ 30అక్టోబర్ 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి ఆర్ వి ఎస్ జిల్లా నాయకులు అవారి చందు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం అవుతున్న కనీసం ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. సకాలం లో ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లించని కారణంగా విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. సి ఎం సొంత శాఖ పరిస్థితి యే ఇలా ఉంటే ఇగ మన రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నారు. మంత్రులకు కమిషన్ ల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల చదువుల పైన లేక పోవడం దారుణం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని లేని యెడల ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ వి ఎస్ నాయకులు వెంకటేష్, సన్నిత్ రావు, నేరెళ్ళ మహేష్ , రేవెళ్ళ సూర్య,మహేష్ తదితరులు పాల్గొన్నారు