యాసంగి పంటల సాగు పై రైతులకు అవగాహన

సాక్షి డిజిటల్ న్యూస్ 30 అక్టోబర్ 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా( షేక్ గౌస్ సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి) ప్రాంతీయ చెరుకు మరియు వారి పరిశోధన స్థానం రుద్రూర్ దత్తత గ్రామమైన హున్సా రైతు వేదిక యందు యాసంగి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణ చైతన్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రుద్రూర్ ప్రాంతీయ చెరుకు మరియు పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పవన్ చంద్ర రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కే పవన్ చంద్ర రెడ్డి మాట్లాడుతూ రైతులు వాతావరణ ఆధారిత సూచనలకు అనుగుణంగా సాగు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా రైతులు సాగులో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి అడిగి తెలుసుకుని నివారణ చర్యలను సూచించారు. దత్తత గ్రామ ఇన్చార్జి శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్ మాట్లాడుతూ పరిశోధన స్థానం నుండి యాసంగి సాగుకు అనువైన రుద్రూర్ 1162 రకం యొక్క లక్షణాలను సాగు విధానం గురించి రైతులకు వివరించారు. కీటక శాస్త్రవేత్త ఎం సాయి చరణ్ మాట్లాడుతూ వరి శనగ ఇతర పంటలలో రసాయనాలు మరియు ట్రైకోడెర్మాని ఉపయోగించి విత్తన శుద్ధి చేసే విధానం గురించి పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి వివరించారు. బ్రీడింగ్ సాసవిత్త జి రాకేష్ మాట్లాడుతూ రుద్రూర్ పరిశోధన స్థానం నుండి విడుదలైన రుద్రూర్ చెరుకు 81 గుణ గుణాలు సాగు మెలకువలు రైతులకి వివరించారు. మృతిక శాస్త్రవేత్త డాక్టర్ ఏ కృష్ణ చైతన్య మాట్లాడుతూ పంట సాగులో వినియోగించవలసిన ఎరువుల మోతాదు చౌడు భూముల యాజమాన్యం గురించి వివరించారు. డాక్టర్ వైఎస్ పరమేశ్వరి మాట్లాడుతూ వరిచెనుగా మరియు వివిధ పంటలలో కలుపు యాజమాన్యం మేలైన సాగు విధానాల గురించి వివరించారు. అనం