సాక్షి డిజిటల్ న్యూస్,అక్టోబర్ 29,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: రాగల మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందువలన ప్రతి గ్రామంలో ప్రజలు ఎవ్వరు కూడా అనవసరంగ బయట తిరగవద్దని, ప్రయాణాలు చేయవద్దని, శిదిలావస్థ ఇండ్లలో నివసించకూడదని తెలిపినారు. ఆలా నివసించిన వారిని గుర్తించి వేరే సురక్షిత ప్రదేశాలకు తరలించాలి.మూసి పరివాహక ప్రాంతాలలో మూసి నదిలోనికి ప్రజలు, పశువులు, మరియు చేపలు పట్టడానికి ఎవరు కూడా వెళ్లొద్దన్నారు. చెరువులు,కుంటల అలుగుల నీరు ప్రవాహం దగ్గరికి ఎవ్వరిని పోనివ్వకుండా చూడాలన్నారు. సిబ్బంది అందరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోని మీ విధులు నిర్వహించాలి. కరెంటు స్తంబాలు, ట్రాన్స్ఫర్మర్స్ ముట్టుకోవద్దని, పశువులను కూడా వర్షాలకు బయటకు వదలకుండా చూడగలరు.మీ గ్రామం పంచాయతీ సెక్రటరీలకు చెప్పి గ్రామంలో టామ్ టామ్ వేపించి ప్రజలకి అవగాహనా కల్పించాలి.చెరువుల వద్దకు, కాలువల వద్దకు ఎవ్వరిని పోనివ్వొద్దు, చాపలు పట్టకుండా చూడాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడువకుండా టార్పాలిన్ కప్పాలి. మెడికల్ సిబ్బంది గ్రామాలలో అందుబాటులో ఉండి అంటూ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకువాలి.లో లెవెల్ కాస్ వేస్ ఉన్న వద్ద ప్రవాహం ఎక్కువ ఉన్న ప్రదేశాలలో పోలీస్ శాఖ, రెవిన్యూ, పంచాయతీ రాజ్ శాఖ టీం వర్క్ చేసి ప్రజలను కాస్ వేస్ దాట కుండా బారికేడ్స్ అడ్డం పెట్టి సిబ్బందిని నియమించవలెను. వర్షాల వలన పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండవద్దు. వీఆర్ఏ, జిపిఓ, పంచాయతీ సెక్రటరీలు అందరు కూడా మీ గ్రామాలలో తిరిగి ఎటువంటి అవంచనీయ సంఘటన జరుగ కుండా చూడాలి ముఖ్యంగా ప్రజలను అప్రమత్తం చేయగలరు.రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మీ పరిది లోని గ్రామాలకు వెళ్లి పై విషయాలపై పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలి. అని జిల్లాలోని అన్ని మండలాల్లో తహసిల్దారులకు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా టోల్ ఫ్రీ నెంబర్-08685293312