మొంథా తుఫాన్ ఎఫెక్ట్

★పత్తి, వరి పంటలకు అపారనష్టం ★పెట్టుబడి బడిఎల్లని పరిస్థితి

సాక్షి డిజిటల్ న్యూస్ అక్టోబర్ 30 2025 రిపోర్టర్ రాజు గద్వాల్ జిల్లా, అన్నదాతల కష్టం వర్షార్పణమైంది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందకుండా పోయింది. పొలాల్లో వరి పంట నేలకొరిగి అవకాశం ఉంది. ఇప్పటికే పత్తి పంటలకు ఎర్రతెగలు సోకి పంట దిగుబడి తగ్గిపోయింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. గతంలో కురిసిన, ఇప్పటి అకాల వర్షాలకు పంటలు బాగా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు పెట్టుబడి ఖర్చులు కూడా గిట్టుబాటయ్యేలా లేదని రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు