సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ రామని గణేష్ ఇదిగానిపల్లి 30-10-2025, తెలంగాణలో కురుస్తున్నటువంటి వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి కాబట్టి జడ్చర్ల నియోజకవర్గలోని వివిధ మండలాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామల్లో ఉండే ప్రజలకు గిరిజన తాండల్లో ఉండే ప్రజలకు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడు అభిమన్యురెడ్డి తెలిపారు. అభిమన్యురెడ్డి సాక్షి డిజిటల్ ప్రతినిధితో మాటాడుతూ వివిధ మండలాల, గ్రామాల ప్రజలకు వాగులు, కాలువలు, నదులు, చెరువుల వద్దకు వెళ్లకండి అందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అలాగే నీరు అధికంగా ప్రవహిస్తున్న ప్రాంతాలకు ఇప్పుడు వెళ్ళకండి వాగులు, ప్రవహిస్తున్న రహదారులను దాటరాదు. చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిల భవనాల వద్ద నిలవ కూడదు. కరెంటు స్తంభాలు, విద్యుత్ తీగలు దగ్గరికి వెళ్ళకండి నడుచుకుంటూ వెళ్లేవారు అండర్ డ్రైనేజ్ మెయిన్ హోల్స్ వద్ద జాగ్రత్తగా చూసుకోండి రహదారులు గుంతలు ఉన్నందున వాహనాలు నెమ్మదిగా వెళ్ళండి అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్ళండి అని జడ్చర్ల బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడు అభిమన్యురెడ్డి తెలియజేసారు.